Header Banner

వివేకా హత్య కేసులో.. ఐదేళ్లలో ఐదుగురు సాక్షుల మృతి! స్పెషల్‌ టీమ్‌ దర్యాప్తు ప్రారంభం!

  Fri Mar 07, 2025 10:53        Politics

ఆరేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఏపీలో పెను సంచలనం రేపగా.. ఇప్పుడు ఆయన కేసులో సాక్షులుగా ఉన్న ఐదుగురు గత ఐదేళ్లలో అనుమానాస్పదంగా చనిపోవడం మరో సంచలనం రేపుతోంది. ఇలా సాక్షులు వరుసగా చనిపోతుండటంపై పోలీసులే షాకవుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులోని సాక్షుల మరణాలు విస్తుగొలుపుతున్నాయని వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మరణాలపై దర్యాప్తుకు సెట్ ఏర్పాటు చేశారు. తాజాగా వివేకా హత్య కేసులో ఆయన ఇంటికి గతంలో వాచ్ మెన్ గా ఉన్న రంగన్న చనిపోయాడు. అయితే ముందు ఇది సాధారణ మరణంగానే భావించినా..ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు మార్చి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అంతకు ముందు ఇదే కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ వేర్వేరు కారణాలతో చనిపోయారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా వివేకా హత్య కేసులో ఆయన ఇంటికి గతంలో వాచ్ మెన్ గా ఉన్న రంగన్న చనిపోయాడు. అయితే ముందు ఇది సాధారణ మరణంగానే భావించినా..ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు మార్చి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అంతకు ముందు ఇదే కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ వేర్వేరు కారణాలతో చనిపోయారు. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షుల మరణాలపై స్పందించిన వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్..వీరి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా? అనే కోణంలో లోతుగా దర్యాఫ్తు చేస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో ఐదుగురు కీలక సాక్షులు మృతి చెందారని, సాక్షులు ఏయే కారణాలతో, ఏ పరిస్థితుల్లో చనిపోయారో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


వారికి ఏమైనా ఆనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేక ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాఫ్తు జరుగుతోందన్నారు. సమగ్ర విచారణ కోసం డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. సాక్షులు చనిపోయినప్పుడల్లా సీబీఐ వల్లే వారు చనిపోయారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. అలాంటి ప్రచారాన్ని ఎందుకు, ఎవరు చేస్తున్నారనే కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వాచ్‌మన్ రంగన్న బుధవారం సాయంత్రం మృతి చెందాడని, రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ అతని భార్య ఫిర్యాదు చేశారని ఎస్పీ వెల్లడించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతి చెందిన సాక్షులకు సంబంధించిన కేసులన్నింటిని దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #viveka #murdercase #todaynews #flashnews #latestnews